Share News

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 02 , 2024 | 09:27 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి.

AP Elections 2024: ఆరా మస్తాన్ సర్వే ఎవరి తరఫున చేశారు.. ఖర్చు ఎంత..!?.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్
CM Ramesh

అనకాపల్లి: ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మే 13వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అధికాక నిన్న మెజార్టీ సర్వేలు ఎక్సిట్ పోల్స్‌లో కూడా ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టనుందని తెలిపాయి. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సిట్ పోల్స్ (Exit polls) ప్రకటించిన ఫలితాలపై తెలుగుదేశం పార్టీ ,జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ (CM Ramesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆరా మస్తాన్ సంస్థ ఎవరి తరపున సర్వే చేశారని.. ఈ సర్వేకు అయిన ఖర్చు ఎవరిచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అదే సంస్థతో తాను అనకాపల్లి జిల్లాలో సర్వే చేయించుకుంటే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని నివేదిక ఇచ్చారన్నారు. కొన్ని మీడియా సంస్థలు డిబేట్‌కి పిలిచి తమను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. వీటి పైన తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తామన్నారు. దాదాపుగా అన్ని సర్వేలు దేశంలో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ,జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేశాయని అన్నారు.


ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెందిన జనం సునామీలా వచ్చి కూటమికి మద్దతు ఇచ్చారన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూటమి ఏజెంట్లు సంయమనం పాటించాలని కోరారు. తగాదాలు సృష్టించాలని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయని.. తన దృష్టికి వచ్చిందని అన్నారు. కొన్ని రకాల తప్పుడు సర్వేలతో తప్పుదోవ పట్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని సీఎం రమేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Elections 2024: కౌంటింగ్ రోజు ఘర్షణలు సృష్టించే అవకాశం: నాందెడ్ల మనోహర్

AP Elections2024 : ఎగ్జిట్ పోల్స్ కంటే కూటమికి ఎక్కువ స్థానాలు: అప్పలనాయుడు

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 10:19 PM