Share News

AP Elections: వైసీపీకి 175 కాదు.. ఆ సీట్లే వస్తాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 01 , 2024 | 09:05 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని.. అటు ఒకటో నెంబర్ గాని ఇటు ఐదో నెంబర్ గాని కచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు.

AP Elections: వైసీపీకి 175 కాదు.. ఆ సీట్లే వస్తాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్
CM Ramesh

విజయవాడ(ఇంద్రకీలాద్రి): ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని.. అటు ఒకటో నెంబర్ గాని ఇటు ఐదో నెంబర్ గాని కచ్చితంగా లెగిసిపోతాయని ఎద్దేవా చేశారు. శనివారం సీఎం రమేష్ కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందించారు. అమ్మవారికి సీఎం రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ.. తాను ఇప్పుడు బయలుదేరి అనకాపల్లి వెళ్తున్నానని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చానని తెలిపారు.


కచ్చితంగా కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను అనకాపల్లి వెళ్లి కౌంటింగ్ సెంటర్ దగ్గర తమ ప్రతినిధులకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. అందుకే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నానని చెప్పారు.జూన్ 4వ తేదీన విజయంతో తిరిగి మళ్లీ వస్తానని సీఎం రమేష్ పేర్కొన్నారు.

Updated Date - Jun 01 , 2024 | 10:43 PM