Home » Collages
రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లు దొరకడం కష్టమవుతోంది. విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్) పోస్టులైన వీటి కి.. వయో పరిమితి పెంపు బిల్లును గత ఏడాది ఏప్రిల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసైకు పంపగా ఆమె తిరస్కరించారు.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో ఎక్కువ మంది కాలేజీల్లో చేరలేదు. దీంతో 22,753 సీట్లు మిగిలిపోయాయి.
రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలు డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. హైదరాబాద్‌తోపాటు.. పలు జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
వైద్య కళాశాలల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలని సీనియర్ రెసిడెంట్ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్ల బదిలీల కారణంగా ఓ వైపు వైద్యసేవలపై, మరోవైపు బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వబోమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు మరో అవకాశం ఇవ్వాలని సర్కారు అప్పీల్‌కు వెళ్లింది.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ సీట్ల సంఖ్య 10 వేల వరకు పెరగవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్టు అధికారులు సోమవారం ప్రకటించారు.
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూకు వచ్చే మార్గంలోని కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్ నుంచి నెక్సస్ మాల్ వరకు హౌసింగ్ బోర్డు స్థలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన నర్సరీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటపడకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నేడో, రేపో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 వైద్య కళాశాలలకే 200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎనిమిది వైద్య కళాశాలల అనుమతులకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్వోపీ) ఇవ్వలేదు. అనుమతులపై జాతీయ వైద్య కమిషన్ తాజాగా కొత్త కాలేజీల ప్రిన్సిపల్స్‌కు మెయిల్ పంపింది.
ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తంగా 173 ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ కాలేజీల్లో 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి.