Home » Congress 6 Gurantees
కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీష్‌రావు(Harishrao) అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్‌లో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హరీష్‌రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. శనివారం నాడు జహీరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ఈరోజు కరీంనగర్ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.
ఉపాధ్యాయులకు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు , కాంట్రాక్ట్ లెక్చరర్లకు 5వ తేదీ గడుస్తున్న ప్రభుత్వం ఇంకా ఎందుకు జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్లో బీఆర్ఎస్ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 40 సీట్లకంటే ఎక్కువ గెలువదని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం నాడు కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు.
నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఏడారి అయ్యిందని బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. ‘పొలంబాట’లో భాగంగా శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టరని.. ఆ పార్టీలోని నేతల గ్రూప్ రాజకీయాలే పడగొడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. బుధవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు.
తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
పదేళ్లు రాజకీయ దురహంకారoతో, కుటిల బుద్ధితో మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని పాలించారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత నెల రోజుల నుంచి పోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లటం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.