Harish Rao: 5వ తేదీ వచ్చిన జీతాలు ఇంకా ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం
ABN , Publish Date - Apr 05 , 2024 | 10:40 PM
ఉపాధ్యాయులకు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు , కాంట్రాక్ట్ లెక్చరర్లకు 5వ తేదీ గడుస్తున్న ప్రభుత్వం ఇంకా ఎందుకు జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్‌లో బీఆర్ఎస్ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు.
సిద్దిపేట జిల్లా: ఉపాధ్యాయులకు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు , కాంట్రాక్ట్ లెక్చరర్లకు 5వ తేదీ గడుస్తున్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇంకా ఎందుకు జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్‌లో బీఆర్ఎస్ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట రామిరెడ్డి పాల్గొన్నారు.
Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వం తక్షణమే అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇమామ్ మౌజన్‌లకు రూ.12 వేల వేతనం ఇస్తానని రంజాన్ మాసంలో వారిని మోసం చేసిందని మండిపడ్డారు.
కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రతి ఏటా అన్ని వర్గాల పెద ప్రజలకు కానుకలు ఇస్తుండేవారని చెప్పారు. మీకు ఉద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక పంపి ఒకవేళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తే ఉద్యోగులకు నాలుగు డీఏలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్నది కానీ పేదలు అయినటువంటి పోలీసు , ఉపాధ్యాయ ఉద్యోగులకు. బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.
Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...