Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకు మించి గెలవదు
ABN , Publish Date - Apr 05 , 2024 | 08:49 PM
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 40 సీట్లకంటే ఎక్కువ గెలువదని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం నాడు కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు.
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 40 సీట్లను మించి గెలవదని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. శుక్రవారం నాడు కిషన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న 6 గ్యారెంటీల్లో అన్నింటిని ఇంకా ఎందుకు అమల్లోకి తీసుకురావట్లేదని ప్రశ్నించారు. ఏం సాధించారని, ఏం మొహం పెట్టుకొని తుక్కుగుడలో మీటింగ్ పెట్టుకుంటున్నారని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. పరోక్షంగా గ్యారంటీలు అమలు చేయమని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని అన్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..
రాష్ట్రంలో ఎండిపోతున్న పంటల పరిస్థితిని, రైతుల గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ఢిల్లీ మీటింగులు, విదేశీ మీటింగులు కావాలని రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ కరెంట్ కోతలు లేవన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు మొదలు అయ్యాయని ధ్వజమెత్తారు. ఆఖరి గింజ వరకు ధాన్యాన్ని తెలంగాణలో కొంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశాకే తెలంగాణ ప్రజలను ఓట్లు అడగాలని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు
అందుకే బీజేపీలో చేరా :తాడూరి శ్రీనివాస్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధిలో ముందుకెళ్తోందని బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్ (Taduri Srinivas) అన్నారు. తనకు ఇష్టమైన నాయకుడు కిషన్‌రెడ్డి అని చెప్పారు. మాజీమంత్రి ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్ లాంటి బీసీ నాయకులను గుర్తించిన నాయకుడు కిషన్‌రెడ్డి అని చెప్పారు.
ఉద్యమ కాలంలో ఉన్న నాయకులను బీఆర్ఎస్‌లో పక్కన పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ చర్యలతోనే బీజేపీలో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్‌లో సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీలో చేరినట్లు వివరించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు. ఎంబీసీ, సంచార జాతులవారిని కలిపి బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.
Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...