TG Politics: కుటిల బుద్ధితో రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్: మహేందర్‌రెడ్డి
ABN , Publish Date - Apr 02 , 2024 | 07:58 PM
పదేళ్లు రాజకీయ దురహంకారoతో, కుటిల బుద్ధితో మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని పాలించారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత నెల రోజుల నుంచి పోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోందన్నారు.
హైదరాబాద్: పదేళ్లు రాజకీయ దురహంకారoతో, కుటిల బుద్ధితో మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని పాలించారని కాంగ్రెస్ (Congress) నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత నెల రోజుల నుంచి పోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ విలువలను, పౌర హక్కులను తూట్లు పొడిచి తన ఇష్టానుసారంగా కల్వకుంట్ల కుటుంబం పాలించాలని అనుకున్నదని మండిపడ్డారు.
Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!
నాటి నుంచి నేటి వరకు న్యాయ ప్రకారంగా కాంగ్రెస్ ముందుకు సాగుతున్నదని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ డిప్లమేశన్ ఫిర్యాదుకు ఎవరు భయపడరని అన్నారు. తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ బయపడదన్నారు. కేటీఆర్ ఏ నోటీసులిచ్చిన సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పరువున్నొడు పరువు గురించి మాట్లాడాలన్నారు. ఆయన వల్ల పరువంతా బజారులో పడిందని చెప్పారు. కేటీఆర్ ముందు నీకు పరువుందా. అనేది చూసుకోవాలన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా పిచ్చి ముదిరి పాకాన పడినట్టుగా బీజేపీ నేతల తీరు ఉందని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
Harish Rao: దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా సర్కారు తీరు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి