Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం
ABN , Publish Date - Apr 03 , 2024 | 04:27 PM
తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల్లో ఐదు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
KTR: కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు..: కేటీఆర్
బీఆర్ఎస్ (BRS) 10 ఏళ్లు అధికారంలో ఉన్న నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పినపాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మళ్లీ తనను ఎంపీగా గెలిపించాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. గుండాలలో రెండు బొగ్గుబావులు, ఐటీసీలో చెప్పుల ఫ్యాక్టరీ కోసం కృషి చేస్తానని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని పోరిక బలరాం నాయక్ అన్నారు.
ఇవి కూడా చదవండి
Kavitha: కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి లాయర్లు, బీజేపీ నేతల ఆశ్చర్యం..
TS Govt: నీటి నిర్వహణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు.. ఐఏఎస్ అధికారుల నియామకం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి