Home » Congress 6 Gurantees
అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పారు.
నేడు యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారని ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్ దళితుడిని తెలంగాణ మొదటి సీఎం చేస్తా అని మాట తప్పారని మండిపడ్డారు.
చత్రపతి శివాజీ స్ఫూర్తితో మాజీ సీఎం కేసీఆర్(KCR) 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. సోమవారం నాడు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందేమో కొండంత చేస్తుందేమో గోరంత, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఆరోపించారు.
తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) వెంట ఉండరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. మణుగూరులో సోమవారం నాడు జరిగిన ప్రజా దీవెన సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని మాజీ సీఎం కేసీఆర్ (KCR) పచ్చి అబద్దాలు మాట్లాడుతారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ...తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య , శ్రీకాంతాచారి లాంటి వారు తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారని చెప్పారు.
కాంగ్రెస్ (Congress) అభయ హస్తం తెలంగాణకు భస్మాసుర హస్తమని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు ఆక్రోశంతో మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని కాంగ్రెస్ భయపడుతోందని చెప్పారు.
కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బతుకులు ఆగం అవుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. బుధవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిస్తే తప్పేందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్పై అధికారంలో లేనప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద(KP Vivekanand ) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రభుత్వం కళ్లు తెరిచేలా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు.
రాజకీయంగా పొత్తులు సాధారణమైన విషయమని.. ఇండియా కూటమిలో బీఎస్పీ(BSP) లేదని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా లేదని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని అన్నారు.త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.