Home » Congress 6 Gurantees
పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఇద్దరు సొదరులు మల్కాజ్గిరి, మహబూబ్నగర్ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ స్పందించారు. తన కుటుంబంలో ఎవరూ ఎంపీగా పోటీ చేయరని స్పష్టం చేశారు. తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడవద్దని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్(KCR) విలువ ప్రజలందరికీ తెలిసిందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కు చిత్తశుద్ధి ఉంటే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్(Dasoju Sravan) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని చెప్పి నిరుద్యోగుల పొట్టకొట్టిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmoor Venkat) అన్నారు. మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను చేపట్టారని చెప్పారు. గత ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
Telangana: ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డి మంచి సాంప్రదాయాన్ని పాటించారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాదను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రధాని మోదీ తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడారని మండిపడ్డారు.
ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం ప్రచారం కోసం కాదని, లక్షలాది మంది నిరుద్యోగులకు విశ్వాసం, నమ్మకం కల్పించడానికి చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భద్రాద్రి రాములవారి సన్నిధిలో ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సత్తుపల్లిలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని.. ఈ విషయంలో ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. ఆదివారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించారు.
ఇందిరమ్మ ఇండ్లపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర సచివాలయంలో శనివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని.. సీతారపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని.. పనుల విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పని సరి అని అన్నారు.