KTR: ఆ విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు
ABN , Publish Date - Mar 05 , 2024 | 05:33 PM
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడవద్దని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్(KCR) విలువ ప్రజలందరికీ తెలిసిందని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడవద్దని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించాలని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... మాజీ సీఎం కేసీఆర్(KCR) విలువ ప్రజలందరికీ తెలిసిందని చెప్పారు. కాళేశ్వరం దండగా అంటూ కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగి పోతే రిపేర్ చేయకుండా కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమపై కోపంతో నేతన్నలకు బతుకమ్మ చీరెలు ఆర్డర్ ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మీద బురద జల్లాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంగనర్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప కరీంనగర్‌కు ఆయన ఏం చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Breaking: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖరారు
TS News: టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి