Home » Congress 6 Gurantees
తెలంగాణ విద్యార్థులకు సమస్యలు సృష్టించిందే మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoori Venkat) ఆరోపించారు. తాను విద్యార్థుల నుంచి వచ్చానని. విద్యార్థుల సమస్యలన్నీ తనకు తెలుసునని తెలిపారు. పదేళ్ల కాలంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే అనేక నిర్ణయాలను కేటీఆర్ తీసుకున్నారని మండిపడ్డారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా కిషన్‌రెడ్డి మారారని పొగడ్తలు కురింపించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సంతోషంగా స్వాగతిస్తున్నానని తెలిపారు.
అన్ని రకాల వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సన్నవడ్లు, దొడ్డు వడ్లని కాకుండా అన్నిరకాల వడ్లకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఖమ్మం జిల్లాలో రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో రెండోస్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) అన్నారు.కాంగ్రెస్ పాలనాలో ఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్ అయ్యాయని ఆరోపించారు. రైతంగాన్ని నిలువునా రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ (Congress) కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ మొదట సన్నాలు వేయమన్నారని.. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అనలేదా అని సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ (Congress) అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ఖ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) ఆరోపించారు.వడ్లకు బోనస్‌పై కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులకు వడ్ల బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్‌లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు.