TG News: వడ్లకు బోనస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగిస్తుంది: రావుల శ్రీధర్ రెడ్డి
ABN , Publish Date - May 22 , 2024 | 09:28 PM
కాంగ్రెస్ (Congress) అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ఖ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) ఆరోపించారు.వడ్లకు బోనస్‌పై కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) ఆరోపించారు. వడ్లకు బోనస్‌పై కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్‌లో శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రతి హామీపై రేవంత్ ప్రభుత్వానిది డొంక తిరుగుడు వైఖరేనని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఎప్పుడిస్తారు ? అని ప్రశ్నించారు. విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారని నిలదీశారు. మహాలక్ష్మిలో ప్రతి మహిళకు రూ.2500 నెలకు ఇస్తామన్నారు ?ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోగా చేస్తామని సీఎం రేవంత్ దేవుళ్ల మీద ఒట్లు వేశారు .. దాని అమలు కూడా అనుమానాస్పదంగానే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు మాఫీ చేయడం అసాధ్యమని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News