Share News

Harish Rao: వడ్లకు బోనస్ ఇవ్వాలి.. లేకపోతే అసెంబ్లీని మట్టడిస్తాం

ABN , Publish Date - May 24 , 2024 | 04:36 PM

అన్ని రకాల వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సన్నవడ్లు, దొడ్డు వడ్లని కాకుండా అన్నిరకాల వడ్లకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఖమ్మం జిల్లాలో రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Harish Rao: వడ్లకు బోనస్ ఇవ్వాలి.. లేకపోతే అసెంబ్లీని మట్టడిస్తాం
Thanneeru Harish Rao

ఖమ్మం జిల్లా: అన్ని రకాల వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ప్రకటించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. సన్నవడ్లు, దొడ్డు వడ్లని కాకుండా అన్నిరకాల వడ్లకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఖమ్మం జిల్లాలో రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.


జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని హరీష్ రావు‌కు రైతులు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతుల ఫోన్ నుంచి తల్లాడ ఏవోకు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు జీలుగు విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఏవోను హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకు రేపటి నుంచి జీలుగు విత్తనాలు సరఫరా చేస్తామని ఏవో తెలిపారు.


కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులకు ఇస్తానన్న రుణమాఫీ నేటికీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ధాన్యానికి ఇస్తానన్న బోనస్ నేటికీ అమలు కాలేదన్నారు. రేవంత్ ప్రభుత్వం బోనస్ అమలు చేయకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులతో కలసి అసెంబ్లీ ముట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది: కూనంనేని

బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

Read Latest APNews and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 24 , 2024 | 04:43 PM