Share News

TG Politics: తప్పుడు వార్తలు రాసిన ఆ పేపర్‌పై కేసు వేస్తాం.. మంత్రి జూపల్లి వార్నింగ్

ABN , Publish Date - May 21 , 2024 | 08:45 PM

బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు.

TG Politics: తప్పుడు వార్తలు రాసిన ఆ పేపర్‌పై కేసు వేస్తాం.. మంత్రి జూపల్లి వార్నింగ్
Minister Jupally Krishna Rao

హైదరాబాద్: బీఆర్ఎస్ అనుబంధ పేపర్లో కావాలని తమ ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) మండిపడ్డారు. రాష్ట్రంలోని 19 మద్యం డిపోల్లో అన్ని రకాల బ్రాండ్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని.. తాము ఒక్కొక్కటిగా బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు. మద్యం అమ్మకాల సేల్స్ తగ్గితే బీఆర్ఎస్ నేతలకు వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఈరోజు (మంగళవారం) గాంధీభవన్‌లో మంత్రి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం అమ్మకాలు తగ్గడంతో ప్రజలకు ఏమైనా నష్టం ఉందా? అని నిలదీశారు. మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో అబ్కారీ శాఖలో పైరవీలు చేస్తేనే బదిలీలు, ప్రమోషన్లు ఉండేవన్నారు. తమ ప్రభుత్వంలో పైరవీలకు స్థానం ఉండదని స్పష్టం చేశారు. తాను ఉన్న శాఖలో అవకతవకలు, అవినీతి అనేది ఉండదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ ప్రతిష్ఠను భంగం కలిగించే విధంగా బీఆర్ఎస్ బాక ఉదే పేపర్ ఈ వార్తలు రాస్తోందని ఫైర్ అయ్యారు. కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదన్నారు.


బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టంగా ఉంది కనుక తమ ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. కొంత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి బీర్లు కొరత వచ్చిందన్నారు. ప్రోహిబిషన్, అబ్కారీ శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న వారికి స్థాన చలనం చేస్తామని చెప్పారు. మద్యం అమ్మకాల సెల్స్ తగ్గడంతో బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం అవుతుందా? అని ప్రశ్నించారు. అబ్కారీ , ప్రోహిబిషన్ శాఖపై తప్పుడు వార్త రాసిన పేపర్‌పై 100 కోట్ల రూపాయలు డిఫర్మేషన్ కేసు తమ శాఖ వేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

DGP Harish kumar: వారికి సీఆర్పీసీ 41 నోటిసులిచ్చాం.. కఠిన చర్యలు తీసుకుంటాం

AP Election 2024: ఏపీ నుంచి ఐప్యాక్‌ ఔట్‌..? ... షాక్‌లో వైసీపీ పెద్దలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 08:45 PM