TG News: వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అనలేదా.. కాంగ్రెస్ నేత సూటి ప్రశ్న
ABN , Publish Date - May 22 , 2024 | 09:22 PM
రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ (Congress) కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ మొదట సన్నాలు వేయమన్నారని.. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అనలేదా అని సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్: రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ (Congress) కిసాన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ మొదట సన్నాలు వేయమన్నారని.. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అనలేదా అని సూటిగా ప్రశ్నించారు.
కేంద్రం మెలిక పెట్టిందని కేసీఆర్ తప్పించుకున్నారని చెప్పారు. కేసీఆర్ కూడా జనగామ ఎన్నికల ప్రచారంలో సన్నాలకు రూ.150 బోనస్ ఇస్తానని అన్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తప్పులు చేశారు కాబట్టి మిగిలిన వారు కూడా అలానే చేస్తారని అనుకుంటున్నారని అన్వేష్‌రెడ్డి అన్నారు.
అసలు సన్నాలు, దొడ్డు వడ్లు ఎంతమంది రైతులు పండిస్తారో అవగాహన లేకుండా ప్రతిపక్షాల నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో బుధవారం అన్వేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ ఏడాది సన్నాలు- 14 లక్షల ఎకరాల్లో, దొడ్డు వడ్లు -32 లక్షల ఎకరాల్లో రైతులు పండిస్తున్నారని చెప్పారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సన్నాలకు, దొడ్డు వడ్లకు కేంద్రం ఓకే ధర ఇస్తుందని చెప్పారు.సన్నాలకు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మిల్లర్లు అదనపు ధరతో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
బాయిల్డ్ రైస్ మాత్రమే కేంద్రం తీసుకుంటుందని.. దొడ్డు వడ్లు మాత్రమే బాయిల్డ్ రైస్‌గా వస్తుందన్నారు. ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యం ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఆ రేషన్ బియ్యం మిల్లర్ల వద్ద రీసైక్లింగ్ అవుతుందన్నారు. పీడీఎస్ ద్వారా సన్నాలు ఇవ్వాలంటే ఇక్కడ సన్నాల పంట అవసరమని తెలిపారు. సన్నాల్లో అనేక తేడాలు ఉంటాయన్నారు.బీపీటీలో మాత్రమే నూకశాతం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
ఇతర రకాల్లో దిగుబడి రెండు కిలోల తేడా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సన్నాలు పండించే అవకాశాలు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి సన్నాలు దిగుమతి చేసుకుంటున్నామన్నారు.దొడ్డు వడ్లను పండించే రైతులను ఆదుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందన్నారు. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నేడు రైతులకు మూడు రోజుల్లోనే ప్రభుత్వం సేకరించిన ధాన్యం డబ్బులు వస్తున్నాయని తెలిపారు.
తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు నుంచి పది కిలోల తరుగు తీశారని చెప్పారు.రైతులకు కాంగ్రెస్ పాలనలో లబ్ధి జరుగుతుందని మాటిచ్చారు. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మిల్లర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకోలేదా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని అన్వేష్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News