Home » Congress Govt
కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రి మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గచ్చి బౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మూసీ నిర్వాసితుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, ఎకరాకు రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు.
హరీష్‌రావుకు అంతరాత్మ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో ఆలోచన చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు.
Telangana: రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టమైనా.. ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామని మరోసారి మంత్రి తుమ్మల స్పష్టంచేశారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మరిచిపోవద్దని అన్నారు. చెరువులు ఎవరు కబ్జా చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
తన ఫామ్‌హౌస్ బఫర్ జోన్లో లేదు.. FTLలో లేదని మాజీమంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. అధికారులు వచ్చి లీగల్‌గా ఉందని చెప్పారని అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, సబితా, హరీష్ రావు ఎవరి ఫామ్ హౌస్ ఇల్లీగల్‌గా ఉన్నా కూల్చాల్సిందేనని చెప్పారు. 111జీఓ రాష్ట్రం పరిధిలో లేదని పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్ పాలన అంతా తుస్సేనని విమర్శించారు. రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు ఆగస్ట్ 1వ తేదీన ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభత్వానికి ఉందని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు.