Home » Congress Public Meeting
తెలంగాణ రాష్ట్రం.. నాలుగు కోట్ల మంది ప్రజల పిడికిలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు.
పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల 28న జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపే సభ నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.
కాంగ్రెస్ జెండాలతో కుట్టించుకున్న దుస్తులు.. మెడనిండా కాంగ్రెస్ కండువాలు. నెత్తిన ధరించిన టోపీపై కూడా కాంగ్రెస్ గుర్తే.. కాళ్లకు చూస్తే చెప్పులు లేవు. ఈ రకమైన ఆహార్యంతో మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ఆవరణలో కనిపించిన ఓ వ్యక్తిని చూసి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి... పిలిచి ముచ్చట పెట్టారు.
‘మా అబ్బాయిని మీకు అప్పగిస్తున్నాను’ అని రాయ్‌బరేలీ ఓటర్లను ఉద్దేశించి ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం నాడు తుక్కుగూడ కాంగ్రెస్ ‘జనజాతర’ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు చర్లపల్లిలో జైలులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
Congress Jana Jatara: తుక్కుగూడ.. ఇది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్.! అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ్నుంచే శంఖారావం మోగించి అఖండ విజయం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఇదే తుక్కుగూడ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు కూడా శంఖారావం మోగించింది కాంగ్రెస్. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ (Jana Jatara) అని నామకరణం చేయడం జరిగింది. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది..! ఎక్కడ చూసినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారీ కటౌట్లే కనిపిస్తున్నాయి. తెలుగు మేనిఫెస్టోను ఈ సభావేదికగా రాహుల్ రిలీజ్ చేశారు. ఈ సభావేదికగా నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు ప్రకటించారు. అంతేకాదు.. తెలంగాణతో తనకున్న అనుబంధం.. ఫోన్ ట్యాపింగ్, ఎలక్టోరల్ బాండ్స్ ఈ విషయాలన్నింటిపైనా రాహుల్ అదిరిపోయే ప్రసంగం చేశారు.