Home » Congress
ఫార్ములా-ఈ కేసులో జైలుకు వెళితే యోగా చేసుకుంటానన్న కేటీఆర్.. ఇప్పుడెందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టులకు వెళితే తప్పు పట్టిన ఆయనే.. ఇప్పుడు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకు తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాపలాకుక్కలా కాపాడుతానని చెప్పుకొన్న కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు.. వేటకుక్కల్లా ప్రజల సొమ్మును కొల్లగొట్టారని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పై కాగితాలు విసిరారు. దీనికి ప్రతిగా వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కాగితాలు విసిరారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.
ఎన్డీయే ప్రభుత్వం చర్చలు లేకుండానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగించిందని కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సంబల్, మణిపూర్ సహా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్ చేసినప్పటికీ పట్టించుకోలేదని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని ఆరోపించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవ్వడంతో పాటు దేశ అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రాల్లో ఏదొక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాలన పరంగా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.
Telangana: ఫార్ములా ఈకార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు, కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు.
హైదరాబాద్‌ని సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మధుసూదన చారి ధ్వజమెత్తారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మాజీ సీఎం కేసీఆర్ చాలా కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. కేటీఆర్ తనకున్న శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి తెచ్చారని తెలిపారు