Share News

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

ABN , First Publish Date - Dec 20 , 2024 | 10:24 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూడండి.

Today Breaking News: కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
Breaking News

Live News & Update

  • 2024-12-20T17:17:47+05:30

    కేటీఆర్‌కు బిగ్ రిలీఫ్..

    • ఈ రేస్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

    • కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

    • వారం వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు

    • ఏసీబీ దర్యాప్తు కొనసాగించ వచ్చన్న హైకోర్టు

    • 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

    • తదుపరి విచారణ 27 కు వాయిదా వేసిన హైకోర్టు.

  • 2024-12-20T15:50:07+05:30

    • సీజన్ 10 నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్ వెనక్కి తగ్గారు.

    • రేస్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తొద్దనే ప్రభుత్వం రంగంలోకి దిగింది.

    • అందులో భాగంగానే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.

  • 2024-12-20T15:49:19+05:30

    • ప్రాధమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దం.

    • అఫెన్స్ జరిగిందని తెలిసాక మూడునెలల లోపే కేసు రిజిస్టర్ చేయాలి.

    • 11నెలల తర్వాత కేసు నమోదు చేశారు.

    • లలిత కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ను ప్రస్తావించిన కేటీఆర్ న్యాయవాది.

  • 2024-12-20T15:48:21+05:30

    • ఫార్ములా రెస్ అగ్రిమెంట్ జరిగిన 14 నెలల తరువాత కేస్ పెట్టారు.

    • ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ఏసీబీకి ఏం సంబంధం.

    • ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్ పరిశీలించాలి కానీ ఏసీబీకి సంబంధం లేదు.

    • రెస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే, కేటీఆర్ మీద కేస్ ఎందుకు పెట్టారు - సుదరం.

    • కేటిఆర్ ఎక్కడ లబ్ధి పొందారు ?

  • 2024-12-20T15:42:03+05:30

    కేటీఆర్ తరఫున వాదనలు:

    • 2023 అక్టోబర్ లో చేసుకున్న అగ్రిమెంట్ పరకారమే FEO కి చెల్లించారు.

    • అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుంది.

    • పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.

    • కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో క్రిమినల్ మిస్ కాండక్ట్ నేరం (పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదు.

    • 13(1)a, 409 అనే సెక్షన్ లు వర్తించవు.

  • 2024-12-20T15:40:41+05:30

    LIVE: కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడీ వేడీ వాదనలు..

    • కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ఫై హైకోర్టు‌లో విచారణ ప్రారంభం.

    • కేటీఆర్ తరపు వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం.

  • 2024-12-20T14:52:31+05:30

    పరిటాల రవి హత్యకేసులో నిందితులు విడుదల..

    • పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ముద్దాయిలు.

    • నారాయణ రెడ్డి(ఏ3), రేఖమయ్య(ఏ4), బజన రంగనాయకులు(ఏ5), వడ్డే కొండ(ఏ6), ఓబిరెడ్డి(ఏ8)లకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు.

  • 2024-12-20T13:47:36+05:30

    కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

    • కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

    • జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్‌లో మరికాసేపట్లో విచారణ

    • ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్

    • ఏసీబీ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్

    • ఏసీబీ దర్యాప్తుపై స్టే కోరిన కేటీఆర్

  • 2024-12-20T13:15:44+05:30

    పరిటాల రవి హత్య కేసు నిందితులు విడుదల

    • జైలు నుంచి పరిటాల రవి హత్య కేసు నిందితులు విడుదల

    • ఐదుగురికి గురువారం బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

    • కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల

  • 2024-12-20T12:33:15+05:30

    కేటీఆర్‌కు మరో షాక్.. వివరాలు అడిగిన ఈడీ

    • తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ

    • కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలన్న ఈడీ

    • ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరిన ఈడీ

    • దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ పంపాలన్న ఈడీ

    • లావాదేవీలు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలన్న ఈడీ

  • 2024-12-20T11:13:29+05:30

    కేటీఆర్‌కు హైకోర్టులో షాక్

    కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు నిరాకరించిన హైకోర్టు

    తనపై నమోదైన కేసు గురించి హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్

  • 2024-12-20T10:24:08+05:30

    అసెంబ్లీ వాయిదా..

    తెలంగాణ శాసనసభ 15 నిమిషాలు వాయిదా

    ఈ కార్ రేసింగ్‌పై చర్చకు బీఆర్‌ఎస్ పట్టు

    చర్చించాలంటూ బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాలు

    గవర్నర్ అనుమతి ఇచ్చాక, చర్చ అవసరం లేదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

    సభ్యుల ఆందోళనతో శాసనసభ 15 నిమిషాల వాయిదా