Home » Covid-19
కరోనా ( corona ) మహమ్మారి మరోసారి జిల్లాను భయపెడుతోంది. తగ్గిపోయిందనకున్నా కొవిడ్ మళ్లీ విజృంబిస్తుడడంతో ప్రజలు భయాందళనకు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా కరోనా కేసులు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో 4 రోజుల వ్యవధిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరికి నెగటివ్ రాగా ప్రస్తుతం మూడు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 322 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,742కు చేరింది.
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) వ్యాప్తిపై ఇండియాలో డిసెంబర్ 21వ తేదీ వరకూ 22 కేసులు నమోదయ్యాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కోవిడ్-19 క్లస్టరింగ్ సమాచారం ఇంతవరకూ లేదు. అన్ని కేసుల్లోనూ కోవిడ్ వేరియంట్ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల(Corona Cases) సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 594గా ఉంది.
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని అయినా కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌గుండూరావు(Medical and Health Minister Dinesh Gundu Rao) సూచించారు.
కరోనాతో 15 ఏళ్ల బాలిక మాటలు కోల్పోవడం అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస సంబంధిత వ్యాధితో బాధితురాలు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్( Massachusetts General Hospital)లోని అత్యవసర విభాగంలో చేరింది.
కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులపై కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ ఉపరకానికి చెందిన 21 కేసులు ఇంతవరకూ నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో 19, కేరళ, మహారాష్ట్రలో చెరో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు.
విలేజ్ హెల్త్ క్లీనిక్‌లలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ( Rapid test kits ) ను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణ బాబు ( Krishna Babu ) తెలిపారు. మంగళవారం నాడు కొవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై హెచ్ఓడీలు, వైద్యాధికారులతో కృష్ణబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనా ( Carona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌తో భారతదేశంలోని పలు రాష్ట్రాలల్లో కేసు నమోదవుతున్నాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.