Krishna Babu: కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Dec 19 , 2023 | 11:09 PM
విలేజ్ హెల్త్ క్లీనిక్‌లలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ( Rapid test kits ) ను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణ బాబు ( Krishna Babu ) తెలిపారు. మంగళవారం నాడు కొవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై హెచ్‌ఓడీలు, వైద్యాధికారులతో కృష్ణబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: విలేజ్ హెల్త్ క్లీనిక్‌లలో కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ( Rapid test kits ) ను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణ బాబు ( Krishna Babu ) తెలిపారు. మంగళవారం నాడు కొవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై హెచ్‌ఓడీలు, వైద్యాధికారులతో కృష్ణబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిచారు. కేరళ, తదితర రాష్ట్రాలలో తాజాగా కొవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఏపీలో పరిస్థితిపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కృష్ణ బాబు మాట్లాడుతూ...‘‘శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎలాంటి వ్యాధి లక్షణాలు కన్పించినా దగ్గరలోని విలేజ్ క్లీనిక్‌లలో పరీక్షలు చేయించుకోవాలి. రానున్న పండుగ సీజన్లలో ప్రజల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’’ అని సీఎస్ ఎం.టి.కృష్ణ బాబు పేర్కొన్నారు.