Home » CPI Narayana
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐతో పొత్తు వలనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్ సమాధి కట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) ఉమ్మడి ఖమ్మం /జిల్లాలో తమ పార్టీకి ఎలాంటి సహకారం అందించలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు.
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఆహ్వానించే పరిస్థితి రానుందన్నారు. ప్రశ్నిస్తున్నాడని ఒక్కపుడు కేసీఆర్... రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారని.. అదే రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి కేసీఆర్ రెడీగా ఉండాలన్నారు.
Telangana Politics: తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారిన వేళ సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలవాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారని.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తెలిసే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని నారాయణ అన్నారు. కానీ కేసీఆర్‌ను కలవడానికి చంద్రబాబు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
Assembly Elections : టీడీపీ అధినేత చంద్రబాబును కలవాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యత్నిస్తున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు ఒప్పు కోలేదని.. కేసీఅర్ ఓటమి తెలిసే చంద్రబాబుని కలిసే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ తీరు చూశామన్నారు. ఇప్పుడేమో బాబు మద్దతు కోసం చూస్తున్నానని సీపీఐ నారాయణ తెలిపారు.
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ సన్ స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్‌కు మాత్రం డాటర్ స్ట్రోక్ అంటూ కామెంట్స్ చేశారు. మంగళవారం రఘునాథపాలెం మండలం బాలపేటలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారాయణ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ( Congress ) నేతలపై ఐటీ దాడుల వెనుక బీజేపీ ( BJP ) , బీఆర్ఎస్ ( BRS ) పార్టీ కుట్ర ఉందని సీపీఐ నేత నారాయణ ( Narayana ) వ్యాఖ్యానించారు.
మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ - సీపీఐ ( Congress - CPI ) పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కు తమ పార్టీ నేతలు మద్దతుగా ఉండాలనీ.. మద్దతుగా ఉండనీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్‌లో పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Elections: సీపీఎం, సీపీఐ లిస్ట్‌కు కాంట్రవర్సీ లేదని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో తాము భాగస్వాములమన్నారు. ప్రియాంకగాంధీ సభలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇవాళ జాతీయ నాయకులు టి.రాజా ఖమ్మం వస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ముదుర్లని.. ఐదు సీట్లు అడిగితే తమకు ఒక్క సీటే కేటాయించారని తెలిపారు. వివేక్ గద్దలా తమకు కేటాయించాల్సిన సీటు ఎత్తుకుపోయారని విమర్శించారు.