Narayana: కవిత అరెస్ట్ అవ్వకుండా కేసీఆర్ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు
ABN , First Publish Date - 2023-11-24T18:50:42+05:30 IST
మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ..‘‘ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రాలేడు. వనమా కొడుకు రాఘవ విలాస జీవితం కోసం జైలుకు వెళ్లారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటారు. ఇండిపెండెంట్ జలగం వెంకటరావు బీ.ఫాం డబ్బులు పెట్టి కొన్నారు. ఎన్నికల గుర్తు సింహం ను డబ్బులు పెట్టి కొన్నారు. అన్ని నియోజకవర్గాలల్లోనూ సీపీఐ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకు మద్దతుగా ఉన్నారు’’ అని నారాయణ తెలిపారు.