Narayana: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:28 PM
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐతో పొత్తు వలనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్ సమాధి కట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రావడంతో సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐతో పొత్తు వలనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) సమాధి కట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార మార్పిడి ఖాయమని నారాయణ స్పష్టం చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ (BRS Chief KCR) చేసిన మోసం కంటే జగన్ ఎక్కువ తప్పులు చేస్తున్నారన్నారు. తెలంగాణ, ఏపీలో ఒక్కో లోక్‌సభ స్థానంలో సీపీఐ పోటీ చేస్తుందన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని తెలిపారు.
రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడిపోయిందన్నారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. ఇండియా కూటమి ఎంత అవసరమో.. కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం కాంగ్రెస్‌కు అంత ముఖ్యమని చెప్పుకొచ్చారు. పాస్‌బుక్‌లో జగన్ ఫోటోలు ఎందుకు? శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో సీఎం జగన్ సమాధి రాయి వేసుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. బీజేపీ తెలుగు ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉందన్నారు. బీజేపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పూరితంగా కాకుండా వర్క్ పూరితంగా మార్పులు చేసుకోవచ్చన్నారు. పదవి విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదని నారాయణ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..