Home » CPI Narayana
టీడీపీ - జనసేన పొత్తుపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. తమతో వస్తే రండి.. లేకుంటే లేదని పవన్ కళ్యాణ్ బీజేపీకి తేల్చి చెప్పారని అన్నారు. టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని పవన్ తేల్చి చెప్పారన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయించింది కేంద్రంలోని బీజేపీనే అని ఆరోపించారు. బీజేపీ అండదండలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం జగన్కు సాధ్యం కాదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని అన్నారు.
సీపీఐ (CPI) బస్సు యాత్ర ముగింపు సభలో సీపీఐ నేత నారాయణ (Narayana) మాట్లాడుతూ బీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ నేతల (CPI Leaders) సమావేశం ముగిసింది. కాంగ్రెస్ (Congress) పార్టీతో పొత్తులపై చర్చించినట్లు సీపీఐ నేతలు తెలిపారు.
కాంగ్రెస్తో నడిచేందుకే కామ్రేడ్ల మొగ్గు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రెడ్లు కాంగ్రెస్తో జత కట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీతో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు.
సీఐఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైన్స్ పరంగా ఇస్రో శాస్త్రవేత్తలను అందరం అభినందించాలని వ్యాఖ్యానించిన ఆయన.. ఇస్రో ప్రయత్నాలకు మతం రంగు పులమాలని చూస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. ఇస్రో ప్రయత్నాలను అవకాశంగా వాడుకోవాలని చూస్తున్నారని అన్నారు.
అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మార్పుతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ - కమ్యూనిస్టులు కలిసి పోటీచేస్తే బీఅరెస్కు డిపాజిట్లు కూడా రావని దీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రస్తుతం చర్చల దశలో ఉందని, కలిసి పోటీ చేసే పరిస్థితి వస్తే మాత్రం బీఅరెస్ ఓటమి తధ్యమని అన్నారు.