Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచకాలకు పరాకాష్ట: కె నారాయణ
ABN , First Publish Date - 2023-09-09T09:12:21+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని అన్నారు.
తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని అన్నారు. శనివారం ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చేయ్యడం అనేది వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు. వైసీపీ హయాంలో రెండు రకాల పాలన సాగుతోందన్నారు. అందులో ఒకటి రివర్స్ టెండెరింగ్, రెండోది రివేంజ్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండడం దుర్మార్గం అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేయ్యడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పుకొచ్చారు.