Home » CPI
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసికట్టుగా వ్యూహం రచించి పకడ్బందీగా చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్‌కు అపాయింట్మెంట్ ఇప్పించారన్నారు.
సిద్దిపేట జిల్లా: 2007లో రూ. 1300 కోట్ల కేటాయింపుతో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనత సీపీఐదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) కాళ్లు మొక్కుతూ ఆర్థిక ఉగ్రవాదిలా జగన్(JAGAN) పాలన చేస్తున్నాడని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు(Muppalla Nageswara Rao) అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గత నాలుగున్నర ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలేనన్నారు.
విశాఖ టీడీపీకార్యాలయంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు హాజరయ్యారు.
ఒంగోలు: ఏపీకి ముందస్తు ఎన్నికలొస్తే సీఎం జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.
అమరావతి: ఐఏఎస్ - ఐపీఎస్‌లను కాదని అనుకూల బృందాలను ఎన్నికల్లో దింపడం బ్యూరోకాట్స్‌ను అవమానించడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చెప్పారు.
కాంగ్రెస్(Congress)తో పొత్తుపై అవగాహన కుదిరిందని సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Narayana) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)తోనే కమ్యూనిస్టులు(CPI, CPM) నడిచేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రపార్టీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.