Congress: కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు.. వారు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారంటే..?

ABN , First Publish Date - 2023-10-09T17:08:31+05:30 IST

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)తోనే కమ్యూనిస్టులు(CPI, CPM) నడిచేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రపార్టీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Congress: కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు.. వారు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారంటే..?

ఖమ్మం: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)తోనే కమ్యూనిస్టులు(CPI, CPM) నడిచేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రపార్టీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీపీఐ, సీపీఏం పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మొదటగా రెండు పార్టీలకు చెరొక సీటు ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అయితే కమ్యూనిస్టులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో చెరో రెండు స్థానాల్లో టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు నియోజకవర్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. సీపీఏంకు భద్రాచలం, మిర్యాలగూడ ఇవ్వాలని అనుకుంటోంది. భద్రాచలం నియోజకవర్గంలో ఇప్పటికే అక్కడ కాంగ్రెస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సీపీఏంకి ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీలో నిర్ణయం తీసుకుంది. భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్యను పినపాక నియోజకవర్గానికి పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. పాలేరు, ఖమ్మం నుంచి టికెట్లు కావాలని కమ్యూనిస్టులు పట్టుబట్టారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో ప్రచారాన్ని సైతం ముమ్మరంగా చేస్తున్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలవనున్నారు. దీంతో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది.

Updated Date - 2023-10-09T17:22:39+05:30 IST