Home » CPM
ఎన్నికలు జరిగే రోజు ప్రజాస్వామ్యానికి అత్యంత పవిత్రమైన రోజు అని, రక్తపాతాన్ని ఆపాలని ప్రజలను, రాజకీయ పార్టీలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోరారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన హింసాత్మక సంఘటనలు, బ్యాలట్ బాక్సుల లూటీలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి హింసాకాండ తీవ్రంగా ఉంది. శుక్రవారం నలుగురు టీఎంసీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. పోలింగ్ ప్రారంభమవడానికి ముందు తమపై దాడులు జరిగాయని కాంగ్రెస్, సీపీఎం ఆరోపిస్తున్నాయి.
పోలవరం నిర్మాణం విషయంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారని.. కానీ అతీగతి లేదని సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు పోలవరం పునరావాస బాధితులతో కలిసి పాదయాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్నారు.
కృష్ణలంకలో విద్యుత్ భారాలకు నిరసనగా సీపీఎం పోరుబాటకు దిగింది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలను సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోడీ ఆదేశాలతో జగన్ ప్రజలపై విద్యుత్, పన్నుల భారాలు మోపుతున్నారని విమర్శించారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద సీపీఎం నిరసనకు దిగింది.
ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న పోరాటానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులను తమ అధీనంలో ఉండేలా కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సీతారాం ఏచూరి ఖండించారు. ఆర్డినెన్స్ స్థానే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఆప్‌కు తమ పార్టీ మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
జగన్ మంచి పనులు చేస్తున్నందునే మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చప్పడం విడ్డూరమన్నారు. పది రోజునుల్లోనే వీర్రాజు మాటలు మారిపోయాయని అన్నారు.
విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని గద్దె దింపుదామని, దేశాన్ని కాపాకుందాం అనే నినాదంతో సీపీఎం, సీపీఐ ప్రచార భేరి నిర్వహిస్తున్నాయి.