Home » Cricket
ఐపీఎల్-2024లో (IPL 2024) మరో కీలక సమరానికి తెరలేచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో పది ఓడింది. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. టీమ్ గెలవకపోవడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ మార్పు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఐపీఎల్-2024లో నేటి (మంగళవారం) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు షురూ కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 21వ తేదీ మంగళవారం రోజున అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ ఆడనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైంది. కానీ 2, 3 స్థానాల్లో నిలిచే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఐపీఎల్ 2024 లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ భరిత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హెచ్రిచ్ క్లాసెన్ (42), నితీశ్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) రాణించడంతో భారీ టార్గెట్‌ను సన్‌రైజర్స్ ఛేదించింది.
ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో చిట్టచివర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏకంగా వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టారు.
ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రసవత్తరంగా సాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నాలుగు జట్లు ప్లై ఆప్స్ చేరాయి. నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై బెంగళూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భాగ్యనగరం హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య రాత్రి 10 గంటల సమయానికి కూడా ప్రారంభం కాలేదు. ఇంకా వర్షం పడుతూనే ఉండడంతో ఇప్పటిదాకా కనీసం టాస్ కూడా పడలేదు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది.