Share News

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!

ABN , Publish Date - May 20 , 2024 | 09:39 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 21వ తేదీ మంగళవారం రోజున అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!
IPL Playoff

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 21వ తేదీ మంగళవారం రోజున అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. కోల్ కతా నైట్ రైడర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.


మే 22వ తేదీ బుధవారం రోజున అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది.


కోల్ కతా నైట్ రైడర్స్ లేదంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఏదో ఒక జట్టు రాయల్ ఛాలెంజర్స్ లేదంటే రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టుతో మే 26వ తేదీన చెన్నైలో గల ఎంఎ చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.


Read Latest Sports News and Telugu News

Updated Date - May 20 , 2024 | 09:39 AM