Home » Cricket
బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ దేశ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా-1 నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందారు.
క్రికెట్.. రికార్డులకు కేరాఫ్ మాత్రమే కాదు.. కొన్ని ఫన్నీ సీన్స్‌తో పసందు కూడా చేస్తుంది. తాజాగా బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లో ఇదే జరిగింది. థర్డ్ అంపైర్ ఇచ్చిన రిజల్ట్స్.. కేవలం స్టేడియంనే కాదు.. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు.. అందరిచే నవ్వించింది.
క్రికెట్ అంటే ఇష్టపడని యువత ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారు కూడా కాస్త వీలు చిక్కితే చాలు బాలు, బ్యాటు పట్టుకుని మైదానాల్లోకి వెళ్తిపోతుంటారు. ఇక ..
క్రికెట్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హుక్కా తాగుతాడా? నమ్మడానికి కాస్త కష్టమయినా.. ధోనీ హుక్కా తాగడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవును.. ఈ హుక్కా కారణంగా ధోనీ మరోసారి టాప్ వార్తల్లో నిలిచాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమిపాలడంపై క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Sports Round Up: 2023 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది క్రీడల్లో మన ఇండియా టీమ్ ఎలా రాణించింది.. మన ప్లేయర్స్ ఎలాంటి ప్రదర్శన చేశారన్న విషయాల గురించి పలువురు ఆరా తీస్తున్నారు. క్రికెట్ నుంచి జావెలిన్ త్రో వరకు టీమిండియా అన్ని క్రీడల్లో తన సత్తా చాటింది
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అలిస్సా హీలే నేతృత్వంలోని ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయం నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో అవసరమైన 75 పరుగులను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా సాధించింది.
దక్షిణాఫ్రికా నుంచి అకస్మాత్తుగా భారత్ వచ్చిన టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలిశాడు. డిసెంబర్ 26 నుంచి మొదలుకానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నాడు. సెలవు తీసుకున్న మూడు రోజులు కోహ్లీ లండన్‌లో ఉన్నాడని, ఈ మేరకు తన ప్రణాళికలను ముందుగానే టీమ్ మేనేజ్మెంట్కు తెలియజేశాడని బీసీసీబీ వర్గాలు వెల్లడించాయి.
దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య ఈ నెల 26 నుంచి 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఆతిథ్య సౌతాఫ్రికా నుంచి స్వదేశానికి బయలుదేరినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏకంగా రూ.6.80 కోట్ల మొత్తాన్ని వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.