Share News

Viral Video: వామ్మో! ఇదేం బ్యాటింగ్‌రా బాబోయ్.. చూస్తుండగానే పిచ్‌పై నీరు వరదాలా ఎలా పారించాడో చూడండి..

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:40 PM

క్రికెట్ అంటే ఇష్టపడని యువత ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారు కూడా కాస్త వీలు చిక్కితే చాలు బాలు, బ్యాటు పట్టుకుని మైదానాల్లోకి వెళ్తిపోతుంటారు. ఇక ..

Viral Video: వామ్మో! ఇదేం బ్యాటింగ్‌రా బాబోయ్.. చూస్తుండగానే పిచ్‌పై నీరు వరదాలా ఎలా పారించాడో చూడండి..

క్రికెట్ అంటే ఇష్టపడని యువత ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారు కూడా కాస్త వీలు చిక్కితే చాలు బాలు, బ్యాటు పట్టుకుని మైదానాల్లోకి వెళ్తిపోతుంటారు. ఇక నగరాల్లో ఉన్న వారు అయితే నెట్‌లు ఏర్పాటు చేసుకుని మరీ క్రికెట్ ఆడటం చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నాసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సబంధించిన వీడియో ఒకటి నెట్టిం తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బ్యాటింగ్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు నెట్‌లో క్రికెట్ ఆడుతుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఒక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అందరిలాగానే ఇతను కూడా మోకాళ్లకు ప్యాడ్‌లు, చేతులకు గ్లౌజ్‌లు కట్టుకుని బ్యాటు తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. మరో యువకుడు బౌలింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఎలాగైనా అతన్ని ఔట్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్‌గా బౌలింగ్ చేస్తాడు. అయితే బ్యాట్స్‌మెన్ కూడా అంతే వేగంగా బంతిని వెనక్కు కొట్టాడు. దీంతో అది అత్యంత వేగంగా వెళ్లి.. వెనుకే ఉన్న పెద్ద ప్లాస్టిక్ నీళ్ల ట్యాంక్‌ను తాకింది.

Viral Video: జీతం పడలేదని భార్యాభర్తల వింత నిర్వాకం.. నేరుగా ఆఫీసుకు వెళ్లి వారు చేసిన నిర్వాకంతో..

బంతి తాకగానే బెబ్బకు ట్యాంక్ ధమేల్‌మని పగిలిపోయి.. అందులోని నీళ్లేన్నీ వరదలా పారి పిచ్‌ను మొత్తం ముంచేశాయి. దీంతో ఒక్కసారిగా అవాక్కైన బ్యాట్స్‌మెన్.. ‘‘ఇదేంటీ.. మొదటి బాల్‌కే ఇలా జరిగింది’’.. అనుకుంటూ అలాగే చూస్తుండిపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అర్జంటుగా ఈ బ్యాట్స్‌మెన్‌ను ఇండియన్ టీమ్‌లోకి పంపించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా బ్యాటింగ్ అంటే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది రొమాంటిక్ కోతిలా ఉందే.. కారులో కూర్చున్న మహిళా కానిస్టేబుల్స్ వద్దకు వెళ్లి మరీ..

Updated Date - Jan 07 , 2024 | 04:40 PM