Home » Crime
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు.
ఖార్ఖాన, యాంటీ నార్కోటిక్ బ్యూరో (Anti Narcotic Bureau) పోలీసులు కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న 8మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal) తెలిపారు. వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.
అంబర్పేట్(Amberpet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు తరచుగా అత్యాచారం చేసేవాడు. మరోసారి ఆ దారుణానికి పాల్పడుతుండగా.. గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్లో దారుణం జరిగింది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు ఇద్దరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన థార్ కారు పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ను ఢికొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.
బాపట్ల జిల్లాలో ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేశామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.
సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ. 18లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి తనకు సాయం చేయాలని విన్నవించాడు.
మళ్లీ ఆడపిల్ల పుడితే భర్తకు వేరే పెళ్లి చేస్తామని బెదిరించి లింగనిర్ధారణ పరీక్షకు ఒప్పించి, పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని గర్భస్రావం చేయించి గర్భిణి మరణానికి కారకులైన వారిపై పోలీసులు కేసుపెట్టారు.
హైదరాబాద్: నగరంలోని బండ్లగూడలో భారీగా స్టెరాయిడ్స్ ఇంజక్షన్లను డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. దేహదారుఢ్యం కోసం జిమ్ నిర్వాహకులు స్టెరాయిడ్స్ ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిమ్లకు స్టెరాయిడ్స్ ఇంజక్షన్స్ అమ్ముతున్న...