Share News

Hyderabad: బంపర్ ఆఫర్.. గంజాయి పట్టిస్తే రూ.2లక్షలు రివార్డ్..

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:09 PM

ఖార్ఖాన, యాంటీ నార్కోటిక్ బ్యూరో (Anti Narcotic Bureau) పోలీసులు కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న 8మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal) తెలిపారు. వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.

Hyderabad: బంపర్ ఆఫర్.. గంజాయి పట్టిస్తే రూ.2లక్షలు రివార్డ్..

సికింద్రాబాద్: ఖార్ఖాన, యాంటీ నార్కోటిక్ బ్యూరో(Anti Narcotic Bureau) పోలీసులు కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న 8మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal) తెలిపారు. వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థులను విచారించి డ్రగ్స్ సప్లై చేసిన ముగ్గురు పెడ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి, ఓజీ, ఎల్ఎస్డీ వినియోగిస్తున్న పెడ్లర్లు.. స్టూడెంట్స్‌కు సైతం అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో మత్తుపదార్థాలు సప్లై చేసినా, వినియోగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


డ్రగ్స్ తీసుకున్నారో లేదో రెండు నిమిషాల్లో కనిపెడతాం..

మత్తుపదార్థాల విషయంలో నగరంలోని అన్ని కాలేజీలపైనా ఫోకస్ పెట్టినట్లు యాంటి నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య చెప్పారు. డ్రగ్స్ తీసుకునే వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. నూతనంగా తెచ్చిన డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలతో మత్తుపదార్థాలు తీసుకున్నారా లేదా అనే విషయం రెండు నిమిషాల్లో కనిపెడతామని వెల్లడించారు. యాజమాన్యాలు ఫీజులు తీసుకుని కాలేజీలు నడపడమే కాకుండా.. డ్రగ్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు కాలేజీలు చర్యలు తీసుకోకుంటే వారికి నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. 100కిలోల పైన గంజాయి పట్టించిన వారికి రూ.2లక్షల రివార్డు కూడా ఇస్తున్నట్లు ఎస్పీ సాయి చైతన్య చెప్పారు.

ఇది కూడా చదవండి:

TRVKS: బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం..

Updated Date - Jul 03 , 2024 | 09:09 PM