Home » Crop Loan Waiver
ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుమతిచ్చింది. అయితే, కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.
రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశే ఎదురైంది.
పంట రుణాల మాఫీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీ పథకం కోసం పంద్రాగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రూ.2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేకంగా ‘రైతు సంక్షేమ కార్పొరేషన్’ (ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్- ఎఫ్‌డబ్ల్యూసీ) ఏర్పాటుచేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే.
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను ఆగస్గు 15 లోపు మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ అంశంమే ప్రధాన ఎజెండాగా శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశమవుతోంది.
తెలంగాణలో(Telangana) పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి(Telangana Farmers) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు పంట నష్టం(Crops Loss) నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది.
రైతులకు త్వరలో తీపి కబురు చెప్పబోతున్నామని, వారికిచ్చిన హామీ అమల్లో భాగంగా రూ.2 లక్షల రుణ మాఫీపై బ్యాంకర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.