Telangana: రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలో నిధులు..
ABN , Publish Date - May 06 , 2024 | 05:24 PM
తెలంగాణలో(Telangana) పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి(Telangana Farmers) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు పంట నష్టం(Crops Loss) నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది.
హైదరాబాద్, మే 05: తెలంగాణలో(Telangana) పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి(Telangana Farmers) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన బాధిత రైతులకు పంట నష్టం(Crops Loss) నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు జీవో విడుదల చేసింది. పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టం జరుగగా.. 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డిలో 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.