Home » Cyber Crime
మీరు ఫేక్ లోన్ యాప్ డౌన్ లోడ్ చేశారా..? డబ్బులు కూడా తీసుకున్నారా..? సైబర్ కేటుగాళ్ల నుంచి వేధింపులు వస్తున్నాయా..? వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. వేధింపుల గురించి పోలీసులకు చెప్పండి. ఒక్కసారి ఫిర్యాదు చేశారో చాలు.. మీ కంప్లైంట్ ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. మీకు వేధింపులు దాదాపుగా తగ్గిపోతాయి. దాంతోపాటు మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.
సాధారణంగా సైబర్ నేరగాళ్లు.. మాటల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. కాని సైబర్ నేరగాళ్లకే తన చాకచక్యంతో ఝలక్ ఇచ్చిందో మహిళా టీచర్. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు..
సైబర్ నేరగాళ్ల వలలో పడ్డ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ. 18లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి తనకు సాయం చేయాలని విన్నవించాడు.
శ్రీలంకలో అన్లైన్లో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 60 మంది భారత జాతీయులను ఆ దేశ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారులోని మాడివేల, బట్రాముల్లాతోపాటు పశ్చిమ తీర పట్టణం నెగొంబోలో దాడులు చేసి వీరిని సీఐడీ అదుపులోకి తీసుకుందని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
‘వన్‌కాయిన్’ వర్చువల్ కరెన్సీ పేరుతో కేటుగాళ్లు పాలమూరు సహా.. సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల ప్రజలను రూ.300 కోట్ల మేర మోసగించిన ఉదంతమిది. వన్‌కాయిన్‌పై పెట్టుబడి పేరుతో 2014లో దుబాయ్, బల్గేరియా కేంద్రంగా చైనీయులు ప్రారంభించిన మోసాలు..
సైబర్ నేరగాళ్లు.. రూ.32.68 లక్షల చోరీ చేశారు. ఇరాన్‌కు పంపిన పార్సిల్‌పై ఉన్న వివరాలు మనీ లాండరింగ్(Money laundering) కేసుల్లో నమోదై ఉన్నాయని నగరానికి చెందిన మహిళను భయపెట్టి, ఆమె ఖాతా నుంచి రూ.15.76 లక్షలను, గూగుల్ మ్యాప్‌కు రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని నగరవాసిని నమ్మించి, అతని ఖాతా నుంచి రూ.16.68 లక్షలు కాజేశారు.
ఇంట్లోనే కూర్చొని పార్ట్ టైమ్ ఉద్యోగం(Part time job)తో డబ్బులు సంపాదించొచ్చు అని గుర్తుతెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మింది. వారు చెప్పినట్లు చేసి ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 21.78 లక్షలు పోగొట్టుకుంది.
ఎస్బీఐ రివార్డులు, మీషో కూపన్లతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వల విసురుతున్నారు. వలలో పడ్డవారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ, ఓఎల్ఎక్స్(OTP, OLX) మోసాలపై అవగాహన పెరడగంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారు.
ఎస్బీఐ రివార్డు పాయింట్ల(SBI Reward Points) పేరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగినిని, పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి మరో వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. పార్శిల్ బాధితుడి ఖాతా నుంచి రూ. 15.36 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగిని ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచేశారు.
అమాయకులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) రోజురోజుకీ కొంతపంథా ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఎమ్మెల్యేల పేరిటా మోసాలకు దిగుతున్నారు.