Share News

Hyderabad: ‘రివార్డ్‌’లతో వల.. కూపన్లతో ఖాతాలు ఖల్లాస్‌

ABN , Publish Date - Jun 21 , 2024 | 09:41 AM

ఎస్‌బీఐ రివార్డులు, మీషో కూపన్లతో సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వల విసురుతున్నారు. వలలో పడ్డవారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌(OTP, OLX) మోసాలపై అవగాహన పెరడగంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారు.

Hyderabad: ‘రివార్డ్‌’లతో వల.. కూపన్లతో ఖాతాలు ఖల్లాస్‌

హైదరాబాద్: ఎస్‌బీఐ రివార్డులు, మీషో కూపన్లతో సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వల విసురుతున్నారు. వలలో పడ్డవారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌(OTP, OLX) మోసాలపై అవగాహన పెరడగంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారు. ప్రముఖ బ్యాంకులు, సంస్థలు, ఈ కామర్స్‌ సైట్ల పేర్లను ఇందుకోసం వాడుతున్నారు. సిమ్‌లను సేకరించి, వాటికి ప్రముఖ సంస్థల, బ్యాంకుల లోగోలు, పేర్లు తగిలిస్తున్నారు. రివార్డులు, ఆఫర్ల కూపన్‌ల పేరుతో లింక్‌లను పంపుతున్నారు. లింక్‌ ఓపెన్‌ చేసిన వారి ఫోన్‌ను హ్యాక్‌ చేయడంతోపాటు సమాచారాన్ని కూడా తస్కరిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఎస్‌బీఐ రివార్డు పాయింట్లంటూ.. ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా


ఖాతాలోని డబ్బు కాజేయడంతోపాటు, సమాచారం, వీడియోలు, ఫొటోలు సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారు. దసరా, దీపావళి వంటి పండగలు, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డేలాంటి సమయాల్లో ఈ తరహా సందేశాలను సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా పంపుతారు. వాటిని వెంటనే డిలీట్‌ చేయాలని సైబర్‌క్రైం అధికారులు, సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 09:41 AM