Share News

Makthal: సైబర్‌ నేరగాళ్లకు మహిళా టీచర్‌ ఝలక్‌..

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:05 AM

సాధారణంగా సైబర్‌ నేరగాళ్లు.. మాటల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. కాని సైబర్‌ నేరగాళ్లకే తన చాకచక్యంతో ఝలక్‌ ఇచ్చిందో మహిళా టీచర్‌. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీకి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు..

Makthal: సైబర్‌ నేరగాళ్లకు మహిళా టీచర్‌ ఝలక్‌..

  • కొరియర్‌లో డ్రగ్స్‌ అంటూ బ్యాంకు ఖాతా వివరాలు కోరిన ముఠా

  • తన అన్న క్రై బ్రాంచ్‌ అని చెప్పి తప్పించుకున్న ఉపాధ్యాయురాలు

మక్తల్‌, జూన్‌ 29: సాధారణంగా సైబర్‌ నేరగాళ్లు.. మాటల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. కాని సైబర్‌ నేరగాళ్లకే తన చాకచక్యంతో ఝలక్‌ ఇచ్చిందో మహిళా టీచర్‌. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీకి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. తాము ముంబాయి క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘మీ పేరిట ముంబాయి నుంచి థాయ్‌లాండ్‌కు ఇంటర్నేషనల్‌ కొరియర్‌ సర్వీస్‌ నుంచి డ్రగ్స్‌ పార్సిల్‌ వెళ్లింది. మీపై కేసు నమోదైంది. మీరు ఇక్కడికి వచ్చి ఫిర్యాదు రాసి ఇస్తే సరిపోతుంది. లేదంటే మిమ్నల్ని అరెస్టు చేస్తాం’’ అని బెదిరించారు.


పంతులమ్మ కాల్‌రికార్డు చేసుకొని స్పందిస్తూ.. తాము తెలంగాణ వాసులమని అక్కడికి రాలేమని చెప్పారు. పర్వాలేదు ఆధార్‌, పాన్‌కార్డు, బ్యాంకు వివరాలు పంపించాలని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. అలా చేస్తే మీపై కేసు నమోదు కాకుండా చూస్తామని నమ్మబలికారు. దీనికి ఉపాధ్యాయురాలు భయపడకుండా తన అన్న క్రైమ్‌ బ్రాంచ్‌లో పనిచేస్తాడు. మీ ఫోన్‌ నెంబర్‌, వివరాలు వెల్లడిస్తే అక్కడికి వస్తాడని ఝలక్‌ ఇచ్చింది. దీంతో సైబర్‌ నేరగాళ్లు తమ ఫోన్‌ స్విచ్‌ఆ్‌ఫ చేసుకున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 05:05 AM