Home » Danam Nagender
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే కాంగ్రెస్ ఓటమి పాలైందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) ఆరోపించారు.
ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagendhar) తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి ప్లాన్ చేస్తోందని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్నే బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటుందని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరంలో పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 14 లోక్ సభ సీట్టు వస్తాయిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) అన్నారు.
జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదని... ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ ... బీజేపీ(BJP) మధ్యనే ఉంటుందని.. విజయం కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి దానం నాగేందర్(Danam Nagender) అన్నారు.
ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రతినిథ్య చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Telangana: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్స్ దొరకకపోవడం దారుణమన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందన్నారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.