Hyderabad: కమిషనర్ రంగనాథ్‌కు ఆ పోస్ట్ ఇష్టం లేనట్లుంది: ఎమ్మెల్యే దానం
ABN , Publish Date - Aug 13 , 2024 | 01:04 PM
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగష్టు 13: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ ఘటన నేఫథ్యంలో మంగళవారం నాడు ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే దానం మాట్లాడారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దానం వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
ఆ అధికారం ఎవరిచ్చారు..
హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని దానం ప్రశ్నించారు. పార్క్ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గొడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేమీ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై 190 కేసులు ఉన్నాయని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు దానం.