Share News

High Court: ‘దానం’పై అనర్హత వేటు వేసేలాస్పీకర్‌ను ఆదేశించండి

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:08 AM

పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీకి చెందిన నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

High Court: ‘దానం’పై అనర్హత వేటు వేసేలాస్పీకర్‌ను ఆదేశించండి

  • హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి పిటిషన్‌

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీకి చెందిన నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు.


ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనపై అనర్హత పిటిషన్‌ సమర్పించేందుకు వెళ్లగా స్పీకర్‌ అందుబాటులో లేరని తెలిపారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jul 13 , 2024 | 04:08 AM