Share News

Khairatabad: వైభవంగా గంగ తెప్పోత్సవం

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:18 AM

ఏటా గంగపుత్రులు నిర్వహించే గంగ తెప్పోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది.

Khairatabad: వైభవంగా గంగ తెప్పోత్సవం

  • గంగపుత్రులు, భక్తులతో కిటకిటలాడిన సాగర తీరం

ఖైరతాబాద్‌,ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): ఏటా గంగపుత్రులు నిర్వహించే గంగ తెప్పోత్సవం ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. డప్పుచప్పుళ్లు, మహిళల బోనాలు, శివసత్తుల వీరంగాలు, ఒగ్గుడోలు, గుస్సాడి తదితర కళాకారుల విన్యాసాలతో ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఖైరతాబాద్‌ ఏడుగుళ్ల దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ భారీ శోభాయాత్ర కిలోమీటర్‌ మేర కొనసాగుతూ హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ఉన్న గంగమ్మ దేవాలయం వరకు వేడుకగా జరిగింది.


అక్కడ సాగర్‌ జలాల్లోకి గంగ తెప్పను వదిలిన అనంతరం ఐమాక్స్‌ ప్రక్కనున్న హెచ్‌ఎండిఏ మైదానంలో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ముఠాగోపాల్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీహెచ్‌ మాట్లాడుతూ గంగపుత్రులు ఉన్నత చదువులతో పైస్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు.

Updated Date - Aug 19 , 2024 | 03:18 AM