Danam Nagender: త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం
ABN , Publish Date - Jul 13 , 2024 | 04:04 AM
బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం (బీఆర్‌ఎ్‌సఎల్పీ) త్వరలో కాంగ్రె్‌సలో విలీనం కావడం ఖాయమంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ వల్లే ఆ పార్టీ భ్రష్టు పట్టింది.. ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు
ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ ఆదర్శం.. ఆ మర్యాదను చూసి నేర్చుకోవాలి: దానం
హిమాయత్‌నగర్, జూలై 12(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం (బీఆర్‌ఎ్‌సఎల్పీ) త్వరలో కాంగ్రె్‌సలో విలీనం కావడం ఖాయమంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎ్‌సలో మిగిలేది ఆ నలుగురు ఎమ్మెల్యేలేనని, మిగతా వాళ్లంతా కాంగ్రె్‌సలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘‘బీఆర్‌ఎ్‌సలో గతం నుంచీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. పదిమందిదాకా ఎమ్మెల్యేలతో మాట్లాడా. వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఆత్మగౌరవంతో బతకొచ్చని, కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఇదే విషయం చెప్పా’’ అని దానం వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ సర్కారులో రూ.వేల కోట్ల అభివృద్ధిని ముగ్గురు నలుగురు మంత్రుల నియోజకవర్గాల్లోనే చేసుకున్నారని, నచ్చనివారిపై వివక్ష చూపారని అన్నారు. టీడీపీలో ఎమ్మెల్యేలకు ఉండే మర్యాద వేరని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వడానికి అక్కడ ఒక వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. కేటీఆర్ వల్లే బీఆర్‌ఎస్ భ్రష్టు పట్టి పోతోందన్నారు. ఎమ్మెల్యేలను పురుగులు, పూచిక పుల్ల మాదిరిగా చూశారని.. సీఎంను కలవాలంటే కేటీఆర్, ఆయన అనుచరుల అనుమతి తీసుకోవాల్సి వచ్చేదన్నారు.‘గుండు శ్రీధర్ అనే బినామీ రూ.వేల కోట్లు ఎలా సంపాదిచించాడు? సత్యం రామలింగ రాజు కుమారుడు తేజ రాజు ఎలా మళ్లీ సంపాదించాడు? రాజేష్ రాజు ఎలా సంపాదించాడు? అన్నీ బయటకు తీస్తున్నా. రూ.వేల కోట్ల విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములను కేటీఆర్ కోటరీ, స్నేహితులు, అనుచర వర్గం అక్రమించుకున్నారు. అన్నీ తప్పకుండా బయటపెడతా’’ అని దానం వ్యాఖ్యానించారు.