Arvind Kejriwal: అధికారిక బంగ్లా మారవద్దంటూ సూచన... తిరస్కరించిన కేజ్రీవాల్
ABN , Publish Date - Sep 18 , 2024 | 02:30 PM
ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధికారిక బంగ్లాను మరో వారం రోజుల్లో ఆయన ఖాళీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఉన్న అధికార బంగ్లాను ఆయన ఖాళీ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధికారిక బంగ్లాను మరో వారం రోజుల్లో ఆయన ఖాళీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాలో ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్నారు. ఈ బంగ్లాను ఇప్పుడు ఆయన ఖాళీ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
భద్రతా కారణాల దృష్ట్యా.. ఆ నివాసాన్ని ఖాళీ చేయవద్దని అరవింద్ కేజ్రీవాల్‌కు పార్టీలోని పలువురు అగ్రనేతలు సూచించారని సమాచారం. ఈ సూచనను ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సున్నితంగా తిరస్కరించారట. అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై వివిధ సందర్భాల్లో దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భద్రతపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్‌ను ఆ దేవుడే కాపాడతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: New XEC Covid Variant: దూసుకొస్తున్న ఎక్స్ఈసీ వైరస్ .. యూరప్‌లో తొలి కేసు నమోదు
ఈ ఏడాది మార్చి 21న మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల ఈ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.
Also Read: RG Kar case: సీఎం మమత అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే..
తాజాగా జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిగా అతిషిని ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సెనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా లేఖ అందజేశారు. అలాగే అతిషిని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఆమోద పత్రాన్ని కూడా అందజేశారు.
Also Read: PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్
Also Read: Viral Video: ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఉద్యోగి
ఈ నేపథ్యంలో అతిషి.. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు పట్టం కడితేనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతానంటూ కేజ్రీవాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
For More National News and Telugu News