Share News

Atishi: అతిషి పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

ABN , Publish Date - Sep 17 , 2024 | 01:06 PM

న్యూఢిల్లీ పూసా రోడ్డులోని స్ర్పింగ్‌డేల్ హైస్కూల్‌లో అతిషి చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో ఆమె బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరి.. చెవెనింగ్ స్కాలర్‌‌షిప్ అందుకున్నారు. 2003లో చరిత్రలో ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

Atishi: అతిషి పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?
Atishi Marlena Singh

అంతా అనుకున్నట్లే జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారసురాలిగా అతిషి ఎంపికయ్యారు. సోమవారం న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా అతిషి పేరును అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.

ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనాతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఢిల్లీ సీఎంగా అతిషిని ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయనకు కేజ్రీవాల్ వివరించనున్నారు. అనంతరం తన రాజీనామా లేఖను ఢిల్లీ ఎల్జీకి సీఎం కేజ్రీవాల్ అందజేయనున్నారని సమాచారం. దీంతో అటు ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడం.. ఇటు ఢిల్లీ సీఎంగా అతిషి పేరు ఖరారు కావడం వెంట వెంటనే జరిగిపోనున్నాయి.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో చాలా మంది ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అడుగులో అడుగు వేసి నడిచారు. కానీ వారందరిని పక్కన పెట్టి.. అతిషి పేరును ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఖరారు చేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే..

Also Read: History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..


arvind.jpg

అతిషి పూర్తి పేరు.. తల్లిదండ్రులు..

అతిషి పూర్తి పేరు.. అతిషి మార్లెనా సింగ్. 1981, జూన్ 8వ తేదీన న్యూఢిల్లీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, తృప్త వాహీ. వీరిద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

Also Read: New York: స్వామినారాయణ్ ఆలయంపై దాడి: ఖండించిన భారత్


athishi1.jpg

స్ప్రింగ్‌డేల్ నుంచి ఆక్స్‌ఫర్డ్ వరకు..

న్యూఢిల్లీ పూసా రోడ్డులోని స్ర్పింగ్‌డేల్ హైస్కూల్‌లో అతిషి చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో ఆమె బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరి.. చెవెనింగ్ స్కాలర్‌‌షిప్ అందుకున్నారు. 2003లో చరిత్రలో ఆమె ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత 2005లో రోడ్స్ స్కాలర్‌తో ఆక్స్‌ఫర్డ్‌లోని మాగ్డలెన్ కాలేజీకి అతిషి హాజరయ్యారు.

Also Read: Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు


athishi-2.jpg

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అతిషి

2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో అతిషి రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ విధి విధానాలు, రూపకల్పనలో ఆమె క్రియశీలకంగా వ్యవహరించారు. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో అతిషి పాల్గొన్నారు. ఈ దీక్షతో సంబంధమున్న ఆప్ నాయకుడు, కార్యకర్త అలోక్ అగర్వాల్‌కు ఆమె సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

Also Read: Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి రేటు


aap-123.jpg

బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి...

ఇక 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ గంబీర్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతిషి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో దాదాపు 4.5 లక్షల ఓట్ల తేడాతో ఆమె ఓటమిపాలయ్యారు. అనంతరం 2020లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్‌కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా ఆమె రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ధర్మంబిర్ సింగ్‌పై అతిషి ఘన విజయం సాధించారు.

Also Read: టెలిఫోన్ భవన్ చేరుకున్న బడా గణపతి


athishi00.jpg

అతిషి చేతిలో 11 మంత్రిత్వ శాఖలు..

కేజ్రీవాల్ కేబినెట్‌లో అత్యంత కీలకమైన 11 శాఖలు అతిషినే పర్యవేక్షిస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అలాగే ఢిల్లీలో మంచి నీటి ఇబ్బందులు ఏర్పడినప్పడు నీటి శాఖ మంత్రిగా అతిషి... నీటి విడుదల కోసం కేంద్రంలోని బీజేపీతోనే కాదు.. పక్కనున్న హరియాణాలోని బీజేపీ ప్రభుత్వంతో పెద్ద యుద్దమే చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టయిన నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అతిషీనే అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే.

For More National News and Telugu News

Updated Date - Sep 21 , 2024 | 05:10 PM