Share News

Arvind Kejriwal: అక్టోబర్ 6న జనతా కా అదాలత్

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:13 PM

న్యూఢిల్లీ ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించుకొనేందుకు ఆ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం అక్టోబర్ 6వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని చత్రశాల్ స్టేడియంలో జనతా కా అదాలత్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 22న జంతర్ మంతర్ వద్ద ఆయన నిర్వహించిన సంగతి తెలిసిందే.

Arvind Kejriwal: అక్టోబర్ 6న జనతా కా అదాలత్
Delhi Ex CM Arvind Kejriwal

న్యూఢిల్లీ, అక్టోబర్ 01: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జనతా కా అదాలత్‌ను మరోసారి నిర్వహించనున్నారు. అక్టోబర్ 6వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని చత్రశాల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన ఇదే కార్యక్రమాన్ని అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Also Read: Durga Navaratri 2024: శరన్నవ రాత్రులు.. అమ్మవారి అలంకారాలు.. నైవేద్యం


ఢిల్లీ ప్రజలతో నేరుగా ప్రభుత్వం సంబంధాలు కలిగి ఉండేలా ఈ జనతా కా అదాలత్‌ కార్యక్రమాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం వేదికగా ప్రజలు.. తమ సమస్యలను ప్రభుత్వంలోని మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో నేరుగా విన్నవించుకోవచ్చు. ప్రజలు, ప్రభుత్వం మధ్య దూరాన్ని తగ్గించుకొనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

Also Read: West Bengal: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు


మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించింది. ఈ కేసులో ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా ఎక్కడా సంతకం చేయవద్దంటూ సీఎం కేజ్రీవాల్‌కు షరతు సైతం కోర్టు విధించింది. దీంతో జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జనతా కా అదాలత్‌ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


అలాగే బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ మరునాడు ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ పక్షం సమావేశమైంది. దీంతో అతిషిని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశమ్యారు. అందులోభాగంగా తన ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా లేఖతోపాటు అతిషిని సీఎంగా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న పత్రాలను ఢిల్లీ ఎల్జీకి అందజేశారు. దాంతో ఢిల్లీ సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టారు. ఇక అక్టోబర్ 6వ తేదీన చాత్రశాల్ స్టేడియంలో ఈ ‘జనతా కా అదాలత్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.


ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో నాటి నుంచి ఆయన జైల్లోనే ఉండిపోయారు. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం తీహాడ్ జైల్లోనే ఉన్నారు. దీంతో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరిగిందని ఆ పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.


మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లోనే అంటే.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోనే నిర్వహించాలని అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహిస్తామని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అదీకాక.. రానున్న ఎన్నికల్లో ప్రజలు తన పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తానంటూ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకోసమే తాను ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

For More National News And Telugu News...

Updated Date - Oct 01 , 2024 | 05:13 PM