Home » Delhi Excise Policy
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారించనుంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 5 సార్లు సమన్లు ఇచ్చినా లెక్క చేయలేదని పేర్కొన్నారు. ఆ కేసులో ఈ రోజు కేజ్రీవాల్ కోర్టుకు రావాల్సి ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారంనాడు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం శనివారంనాడు సభలో చర్చకు చేపట్టనున్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 28న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వ్యవహారం ముదురుతోంది. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరుకావాల్సిందింగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తాజాగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఎక్సైజ్ పాలసీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదుసార్లు తమ సమన్లును బేఖాతారు చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 17న హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ పార్లమెంటుకు వెళ్లి రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు రెండోసారి అనుమతించింది. ఫిబ్రవరి 8 లేదా 9వ తేదీల్లో ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మంగళవారంనాడు అనుమతించారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి సంజయ్ సింగ్‌ను తగిన భద్రతతో ప్రమాణస్వీకారానికి తీసుకు వెళ్లాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పదేపదే విచారణకు గైర్హాజర్ అవుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై రౌస్ అవెన్యూ కోర్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆశ్రయించింది. పీఎంఎల్-2002 సెక్షన్ 50 కింద సీఎంపై కోర్టులో ఫిర్యాదు చేసింది. తాము పంపిన సమన్లను ఖాతరు చేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది.
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. జనవరి 31వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి 2న తమ విచారణ మందు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు మరోమారు సమన్లు పంపింది.